హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఐఎస్సీఈ ఏపీ, తెలంగాణ ప్రి సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ అండర్-17 బాలిక విభాగంలో హైదరాబాద్ ఖైరతాబాద్‌కు చెందిన నాసర్ స్కూల్ అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది.
గచ్చిబౌలిలో శుక్రవారం జరిగిన ఫైనల్లో నాసర్ గర్ల్స్ స్కూల్ టీమ్ 1-0 గోల్ తేడాతో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది.