తల్లి,చెల్లికి అంత్యక్రియలు నిర్వహించిన వైద్యురాలు…

అమరావతి, జూన్ ,18: రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక (గాంధీనగరం) చెందిన జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు చోడిశెట్టి చంద్రశేఖర్ సోదరి సింగలూరి వీరధనలక్ష్మి తన భర్త శ్రీనివాస్ కుమార్తె కావ్యతో కలిసి చెముడులంక నుంచి విశాఖ జిల్లా కారులో వెళుతుండగా విశాఖపట్నం సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కుమార్తె కావ్య, ధనలక్ష్మి మృతిచెందగా భర్త శ్రీనివాస్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శ్రీనివాస్ ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా ఒక కుమార్తె సుప్రజ బెంగుళూరులో వైద్యురాలుగా పనిచేస్తుంది. తండ్రి ఆసుపత్రుల్లోనూ తల్లి, చెల్లి మరణించిన వార్త సుప్రజకు తెలిసిన వెంటనే హుటాహుటిన చెముడులంక చేరుకొని, విశాఖపట్నంలో మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిన అనంతరం చెముడులంకకు తరలించి అక్కడ నుంచి బడుగువానిలంక గౌతమి గోదావరి చెంతన గల పుష్కర ఘాట్ వద్ద వారి అంత్యక్రియల్లో పాల్గొని తలకొరివి పెట్టింది. ఆ కుటుంబం ఒకే సారి ఇద్దర్నీ కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Andhra Pradesh
- AP News
- Dead
- Doctor
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

