INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
INDIA alliance | కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill, 2026) విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
INDIA alliance | కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill, 2026) విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలనే కృత నిశ్చయంతో విపక్షాల ఐక్యతను కాపాడేందుకు కాంగ్రెస్ హై కమాండ్(Congress high command) చివరి నిమిషంలో తీవ్ర ప్రయత్నాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంచే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా (INDIA) కూటమిలోని కీలక మిత్రపక్షాలైన డీఎంకే (DMK), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) పార్టీలను కోరారు.
డీలిమిటేషన్ బిల్లులో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే (సుమారు 850 స్థానాలకు) నిబంధనను చేర్చడంతో, ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్డీఏ కూటమికి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం సమకూరే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌లతో చర్చించి వారి నిర్ణయాన్ని మార్చేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో కూడిన బృందం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిసేందుకు వెళ్లనున్నారు. అలాగే రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశం కోసం ముంబైకి వెళ్లనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. లోక్ సభ సీట్ల పెంపుతో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు.
డీలిమిటషన్ బిల్లును సమిష్ఠిగా ఓడించాలని రాహల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. లోక్ సభ సీట్లు850కి పెంపుతో ప్రజాస్వామ్యం అంతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ , దేశ, తమిళనాడు ప్రజల కోసం స్టాలిన్‌తో కలిసి పని చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
Nani | నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో బయటపడిన పాత సీక్రెట్!
AR Rahman | ‘రాక్‌స్టార్’ పాటలు నచ్చలేదని 8 నెలలు రెమ్యూనరేషన్ ఆపేశారు : ఏఆర్ రెహమాన్ !
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

