లండన్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా మానియా ఏమాత్రం తగ్గలేదు. తనదైన ఆటతీరుతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఏకఛత్రాధిపత్యంతో ఏలిన మారడోనా ఈ లోకాన్ని వీడినా..అతడి జ్ఞాపకాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మెక్సికో సిటీ వేదికగా 1986లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ప్రపంచ సాకర్ చరిత్రలో మరుపురాని మ్యాచ్ గా నిలిచిపోయే ఈ పోరులో మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’తో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. బుధవారం సోత్బే నిర్వహించిన ఆన్లైన్ వేలంలో జెర్సీ అక్షరాల రూ.70.93 కోట్ల ధర పలికింది. అయితే జెర్సీని దక్కించుకున్నది ఎవరన్నది తెలియలేదు. గతంలో మాడ్రన్ ఒలింపిక్ మూవ్‌మెంట్‌కు రూ.67. 12 కోట్లు, బేబ్ రుత్ జెర్సీకి రూ.43 కోట్లు అత్యధిక ధర పలికిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.