Thaman | టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్లలో థమన్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల నుంచి మీడియం రేంజ్ మూవీల వరకూ వరుస ప్రాజెక్టులతో ఈ ఏడాది కూడా ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘OG’, ‘తెలుసు కదా’, ‘అఖండ–2’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన తమన్.. సినిమాల ఫలితాలకంటే తన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే సంగీతప్రియులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ హారర్ కామెడీ జానర్లో రూపొందుతోంది. ఎవర్గ్రీన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు దర్శకుడు మారుతి భారీ కసరత్తు చేస్తున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రభాస్ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, రెండు ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ‘ది రాజాసాబ్’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ సాంగ్‌కు మొదట్లో ట్రోలింగ్ ఎదురైనా, క్రమంగా పాట జనాల్లోకి బాగా వెళ్లింది. ఆ తర్వాత విడుదలైన ‘సహనా సహనా’ పాట మాత్రం ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన ‘రాజాసాబ్ ట్రైలర్ 2.0’కు తమన్ అందించిన ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా మారింది. న్యూట్రల్ ఆడియన్స్ కొందరు రొటీన్‌గా ఉందని కామెంట్స్ చేస్తుంటే, రెబల్ ఫ్యాన్స్ మాత్రం బీజీఎం అదిరిపోయిందని సోషల్ మీడియాలో తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్… “ట్రైలర్ కె ర్యాంప్ అయ్యా మారుతి.. ఆ మ్యూజిక్ ఏంట్రా మెంటల్ నా కొ*కా” అంటూ ట్వీట్ చేయగా, దానికి తమన్ “థ్యాంక్స్ రా పిచ్చ నా పకోడా” అంటూ స్పందించారు. మరో అభిమాని “ఏం కొట్టావ్ అన్నా అసలు.. ఇప్పటివరకు నిన్ను మిస్ అండర్‌స్టాండ్ చేసుకున్నాం” అని పోస్ట్ చేయగా, “అన్నది తమ్ముళ్లేగా.. పర్లేదులే” అంటూ తమన్ కూల్‌గా రిప్లై ఇచ్చారు. అలాగే ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0పై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ తమన్ పేరును ప్రస్తావించకపోవడంపై కూడా ఆయన స్పందించారు. “మ్యూజిక్ బై తమన్ ఎస్. ఇది నా ట్విట్టర్ ఐడీ” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ కూడా తమన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ లెవెల్ ఆర్ఆర్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం ఇండియాలోనే లేరని కొనియాడారు.