స్త్రీనిధి దేశానికి ఆదర్శం
- అతి తకువ వడ్డీకే రుణాలు ఇస్తున్న ఏకైక సంస్థ
- వచ్చే నెల నుంచి అర్హులకు ఆసరా పింఛన్లు
- వార్షిక సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య దేశానికే ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్త్రీనిధి సహకార పరపతి సమాఖ్య 9వ సర్వసభ్య సమావేశం బుధవారం రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. స్త్రీనిధి అధ్యక్షురాలు ఇందిర అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం బాల వికాస సంస్థ మొదట మహిళలను సంఘటితం చేసిందని, ఆ తరువాత ఎన్టీఆర్ హయంలో డ్వాక్రా సంఘాలు మొదలయ్యాయని, ఇప్పుడు సీఎం కేసిఆర్ మహిళలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
స్త్రీనిధితో ఇప్పుడు డబ్బుల కోసం భర్తలు భార్యలను బతిమిలాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మహిళలకు డబ్బులు ఇస్తే ఎకడికీ పోవని, ఎంత కష్టమైనా అప్పులు కడతారని, పొదుపు చేస్తారని డ్వాక్రా మహిళలకు బ్యాంకులు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. వచ్చే నెల నుంచే 57 ఏండ్లు నిండిన అర్హులైన అందరికీ పెన్షన్లు వస్తాయని మంత్రి ప్రకటించారు. అభయహస్తం నిధులను తిరిగి మహిళలకు ఇస్తున్నామని తెలిపారు. స్త్రీ నిధి కమిటీ కాలాన్ని రెండేండ్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. స్త్రీనిధిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి సభ్యులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతీసారి ప్రభుత్వమే సాయం అందించాలని ఆలోచించవద్దని, స్వయంగా ఎదగడానికి ప్రయత్నించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. మెప్మా ఎండీ, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ స్త్రీనిధి ద్వారా కేవలం 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నామని చెప్పారు. స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ స్త్రీనిధి ద్వారా 48 గంటల్లోనే రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్త్రీనిధిని అభినందించిందని, ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని సూచించిందని చెప్పారు. స్త్రీనిధి వార్షిక నివేదికను సంస్థ అధ్యక్షురాలు ఇందిర చదివి వినిపించారు.
స్త్రీనిధి లక్ష్యాలను చేరుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువురు ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని మంత్రి దయాకర్‌రావు అవార్డులతో సతరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాస్ అధ్యక్షుడు సీఎస్ రెడ్డి, స్త్రీనిధి ఉపాధ్యక్షురాలు పీ రాఘవ దేవి, కోశాధికారి సరస్వతి, స్త్రీనిధి డైరెక్టర్లు, మండల, పట్టణ సమాఖ్యల అధ్యక్షులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

