విద్యాశాఖ డొల్లతనం!
తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదోతరగతి, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజుల చెల్లింపుల్లో ప్రధానోపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
- ఫీజులు జమచేసేందుకు ఇబ్బందులు పడుతున్న హెచ్ఎంలు
రామగిరి, నవంబర్ 3 : తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదోతరగతి, వృత్తి విద్యా కోర్సుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజుల చెల్లింపుల్లో ప్రధానోపాధ్యాయులకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల నుంచి ఇప్పటికే పరీక్ష ఫీజు వసూలు చేసిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని ఆన్లైన్లో ప్రభుత్వ ఖాతాకు జమ చేసేందుకు ప్రయత్నిస్తుండగా సర్వర్ సమస్య కారణంగా ప్రక్రియ ముందుకు సాగడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధీనంలో ఉన్న విద్యాశాఖలోనే ఇలాంటి సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడంలో రోజులు గడుస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి.
విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 1 నుంచి 17 వరకు ప్రధానోపాధ్యాయులు ట్రెజరీకి డబ్బులు జమ చేయాల్సి ఉన్నది. ఈ నెల 1 నుంచి ఆన్లైన్ చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్న హెచ్ఎంలకు సర్వర్ డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్య ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించిందని, త్వరలో సాంకేతిక సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

