నవ్వులు పంచే ‘పాకెట్ రాకెట్స్’
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్'.
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర ఆత్రి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. ‘కమిటీకుర్రోళ్లు’ఫేం త్రినాథ్‌వర్మ, నిర్మల్, శ్రియా కొంతం ప్రధాన పాత్రధారులు. గ్యాంబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ విభిన్న కథాచిత్రంలో జేడీ చక్రవర్తి కీలక పాత్రధారి. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘జూలైలో సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఆరునెలల్లో పూర్తి చేసి విడుదల చేస్తున్నాం. డిసెంబర్ 11న సినిమా థియేటర్లలోకి రానున్నది. ఇక రిలీజ్ వరకూ మేమంతా మీ సోషల్ మీడియాలోకి, ఇంట్లోకి వచ్చేస్తాం’ అని తెలిపింది. నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని తాను ఇంతవరకూ చూడలేదని, రుద్ర ఈ సినిమాను ఎంత గొప్పగా తీశారో రేపు థియేటర్లలో చూస్తారని జేడీ చక్రవర్తి అన్నారు. టీమ్ ఇచ్చిన సహకారం వల్లే సినిమాను వేగంగా పూర్తి చేయగలిగానని దర్శకుడు రుద్ర అత్రి చెప్పారు. రెండు గంటల సేపు హాయిగా నవ్వించే సినిమా ఇదని నిర్మాత రాహుల్ రాఘవేంద్ర పేర్కొన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఎదురోలు రాజు, సంగీతం: గ్యానీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

