హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో గంటా కీర్తి విజేతగా నిలిచింది. రౌండ్లు పూర్తయ్యే సరికి కీర్తి, గంటా రాణా స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన టై బ్రేకర్‌లో కీర్తిని విజయం వరించింది. నాసిక్(మహారాష్ట్ర) వేదికగా ఈ నెల 27 నుంచి మొదలయ్యే జాతీయ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కీర్తి, రాణా తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.