హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : నిరుటితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 8వేల మంది అధికంగా మూడేండ్ల డిగ్రీలో చేరారు. ఈ ఏడాది మొత్తంగా 2,13,671 సీట్లు భర్తీ అయినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ(దోస్త్) ప్రవేశాల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మంగళవా రం మాసాబ్‌ట్యాంక్‌లోని మండలి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2026-27లో డిగ్రీ కోర్సుల్లో దోస్త్, నాన్ దోస్త్‌తో కలిసి 2.13 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని తెలిపారు.
ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో నిరుటితో పోల్చితే 342 మంది తక్కువగా చేశారు. ఇక నాన్ దోస్త్ కాలేజీల్లో సీట్లకు కాస్త డిమాండ్ పెరిగింది. నిరుడు 17,583 మంది చేరితే, ఈ ఏడాది ఏకంగా 21,182 మంది చేరారు. అంటే ఈ కాలేజీల్లోనే 3,599 మంది ఎక్కువగా చేరారు.
