హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ) : విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డీఏ ను పెంచాలనే ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యుత్ సౌధలోని జెన్కో ప్రధాన కార్యాలయం లో ఇంధనశాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యు త్ రంగ పనితీరును సమీక్షించారు. వర్షాకాలంలో శాఖపరంగా సన్నద్ధతపై చర్చించారు. ప్రణాళికను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏను డీఏ 17.651% నుంచి 19.272శాతానికి, మొత్తంగా 1.621 శాతం మేర పెంచాల నే ప్రతిపాదనలతోపాటు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా డీఏను పెంచాలని అధికారులు చేసిన ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుండగా, మొత్తంగా 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నది.
ఈ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అంతరాయాలు లేకుండా చూసి న అధికారులను, సిబ్బందిని అభినందించారు. రాబోయే పదేండ్లలో అంటే 2035-36 నాటికి విద్యుత్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకుంటుంద ని, ఈ ఏడాది నమోదైన పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు దాదాపు రెట్టింపు గా ఉంటుందని, అంతేకాకుండా వార్షిక విద్యుత్ అవసరాలు 1,52,626 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని, ఆ దిశగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమీక్షలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాసర్, జెన్ కో సీఎండీ హరీశ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్, ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, ట్రాన్స్ కో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ లతా వినోద్, ఇతర విద్యుత్ సంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు.