తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న సినిమా ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ పతాకంపై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ వందెల దర్శకుడు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘పుడమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా..’ అంటూ సాగే తొలి లిరికల్ పాటను నటుడు తనికెళ్ల భరణి చేతుల మీదుగా విడుదల చేశారు. భవ్యదీప్తి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సందీప్ కుమార్ స్వరపర్చారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ…‘పల్లెటూరి నేపథ్యంగా సాగే ప్రేమకథా చిత్రమిది. మొదటి లిరికల్ పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాం. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను తెరకెక్కించాం. సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’ అన్నారు