Indian-2 Movie | లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కమల్‌కు విక్రమ్ మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు12న రిలీజై తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం అదే జోష్‌తో కమల్ ‘ఇండియన్-2’ సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టే మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ తండ్రి ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయన్ని స్వయంగా యోగ్రాజ్ సింగ్ వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మేకప్ వేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ కెమారా వెనుకు పనిచేసే అందరికీ ధన్యవాదాలు. నన్ను మరింత స్మార్ట్‌గా తయారుచేస్తున్న మేకప్ మేన్‌కు ధన్యవాదాలు. కమల్ హాసన్‌తో ఇండియన్-2లో నటించడానికి పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది అంటూ పోస్ట్ చేశాడు.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరగుతుంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై సుభాస్కరణ్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Read Also:
NTR30 | ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్?
Rajinikanth | కూతురు డైరెక్షన్లో రజనీకాంత్ నెక్స్ట్ సినిమా?
The Ghost | ఓటీటీలోకి వచ్చేసిన ‘ది ఘోస్ట్’.. స్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
Puri Jagannadh | పూరీ జగన్నాథ్ నెక్ట్స్ మూవీ ఆ సీనియర్ స్టార్ హీరోతోనేనా?