NTR30 | ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్?
NTR30 Heroine | 'ఆర్ఆర్ఆర్' వచ్చి ఏడు నెలలు దాటింది. ఓ వైపు చరణ్, శంకర్‌తో 'RC15' చేస్తూనే మరో వైపు 'RC16'ను లైన్లో పెడుతున్నాడు. కానీ జూ.ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలు పెట్టలేదు.
NTR30 Heroine | ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి ఏడు నెలలు దాటింది. ఓ వైపు చరణ్, శంకర్‌తో ‘RC15’ చేస్తూనే మరో వైపు ‘RC16’ను లైన్లో పెడుతున్నాడు. కానీ జూ.ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలు పెట్టలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అభిమాన హీరో నెక్ట్స్ సినిమా ఏంటి అని ఇప్పటివరకు క్లారిటీ లేదు. తారక్ తన తదుపరి సినిమాను కొరటాలతో చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదా ? అనే సందేహాలు కూడా తారక్ అభిమానుల్లో మొదలయ్యాయి.
అయితే ఇటీవలే ఈ మూవీ పీ.ఆర్ టీం స్పందించి త్వరలోనే ‘NTR30’ సెట్స్‌పైకి వెళ్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కొరటాల శివ, డీఓపీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ప్రీ ప్రొడక్షన్ పనులను మరింత వేగ వంతం చేశారని తెలిపాడు. దీంతో ఈ సినిమా కాన్సిల్ అయిందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట. ఈ క్రమంలోనే తారక్‌కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. గతంలో సమంత, రష్మిక, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు బాలీవుడ్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్ మిడ్‌లో షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రానికి అనురుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also:
Puri Jagannadh | పూరీ జగన్నాథ్ నెక్ట్స్ మూవీ ఆ సీనియర్ స్టార్ హీరోతోనేనా?
Kantara | బాక్సాఫీస్‌పై ‘కాంతార’ దండయాత్ర.. 16వ రోజు కూడా కోటిన్నరకు పైగా షేర్..!
Avatar-2 Movie | భారీ స్థాయిలో ‘అవతార్-2’ ఇండియన్ బిజినెస్.. ఆస్తులు అడుగుతున్నారుగా..!
The Ghost | ఓటీటీలోకి వచ్చేసిన ‘ది ఘోస్ట్’.. స్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

