గోదావరిఖని, అక్టోబర్ 4: దసరా పండుగ సమీపిస్తున్నా ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించలేదని, ఇప్పటికైనా ప్రకటించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సింగరేణిలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాల ప్రకటనతోపాటు వాస్తవ లాభాలపై ప్రభుత్వం వెంటనే 36 శాతం వాటా ఉద్యోగులకు చెల్లించాలని సూచించారు.
ఇప్పటివరకు వాస్తవ లాభాలను ప్రకటించని సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణిలోని అన్ని ఏరియాల గనులు, డిపార్మెంట్ల హెచ్వోడీలకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. మంగళవారం అన్ని ఏరియాల్లోని జీఎంలకు వినతిపత్రాలు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంస్థ, ప్రభుత్వం వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 36 శాతం వాటా చెల్లించాలని, లేకపోతే సింగరేణి భవన్, ప్రజా భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.