Tamim Iqbal | వరల్డ్ కప్ ముందు బంగ్లాకు షాక్.. వన్డే కెప్టెన్‌గా తప్పుకున్న తమీమ్ ఇక్బాల్
Tamim Iqbal : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే కెప్టెన్(ODI Captain)గా తప్పుకుంటున్నట్టు ఈరోజు ప్రకటించాడు. ఈమధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమీమ్ సారథిగా...
Tamim Iqbal : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే కెప్టెన్(ODI Captain)గా తప్పుకుంటున్నట్టు ఈరోజు ప్రకటించాడు. ఈమధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమీమ్ సారథిగా వైదొలిగాడు.
‘వన్డే కెప్టెన్‌గా తప్పుకుంటున్నా. ఆటగాడిగా కొనసాగుతూ నా గేమ్‌పై మరింత దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. అవకాశం వచ్చిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాను’ అని తమీమ్ ఓ ప్రకటనలో తెలిపాడు. దాంతో, బంగ్లా నూతన సారథిగా లిట్టన్ దాస్(Litton Das) ఎంపికయ్యే అవకాశం ఉంది.
తమీమ్ ఇక్బాల్

తమీమ్ 2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే బంగ్లాదేశ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఉత్తమ బ్యాటర్‌గా ఎదిగాడు. పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బంగ్లా.. పెద్ద జట్లకు షాక్ ఇవ్వడంలో తమీమ్ పాత్ర ఎంతో ఉంది. మరో విషయం ఏంటంటే.. అతనికి టీమిండియా(Team India)పై ఘనమైన రికార్డు ఉంది. అవును.. అతడి 56 అర్ధ శతకాల్లో భారత్‌పై చేసినవే ఎక్కువ.
ఇవి కూడా చదవండి
IND vs WI | రాణించిన పావెల్, పూరన్.. మొదటి టీ20లో భారత్ లక్ష్యం ఎంతంటే..?
Mukesh Kumar | ముచ్చటగా మూడో ఫార్మాట్లో అరంగేట్రం.. రెండో భారత క్రికెటర్‌గా రికార్డు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

