మమ్మల్ని గుర్తించకపోతే ముప్పే

ప్రపంచ దేశాలకు తాలిబన్ల హెచ్చరిక
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: అఫ్గానిస్థాన్ నుంచి ఏ ముప్పు రావొద్దంటే తమను అధికారికంగా గుర్తించాలని తాలిబన్లు అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించారు. ‘అఫ్గాన్ నుంచి ఏ దేశానికైనా, ఎలాంటి ముప్పు ఎదురైనా.. ఆ దేశం తాలిబన్లను అధికారికంగా గుర్తించనంత వరకు మేం ఎలాంటి బాధ్యత వహించబోమ’ని పేర్కొన్నారు. తాలిబన్లను గుర్తించకపోతే ప్రపంచం అంతటికీ సమస్యలు వస్తాయని హెచ్చరించారు. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకొని రెండు నెలలు గడిచింది. ఇప్పటివరకు చైనా, పాకిస్థాన్ తప్ప తాలిబన్లతో ద్వైపాక్షిక సంబంధాలకు ఏ దేశం ఆసక్తి చూపలేదు. కాగా, తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖూంజాదా శనివారం కాందహార్‌లోని ఓ మదర్సాను సందర్శించారు. దీనికి సంబంధించి ఎలాంటి ఫొటోలు బయటకురాలేదు. రెండు నెలలుగా హైబతుల్లా కనిపించలేదు. ఆయన చనిపోయి ఉంటారన్న వార్తలు కూడా వచ్చాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

