Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
Tabu | టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా ‘కింగ్ 100’తో బిజీగా ఉన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నాగ్.. ఈ ప్రత్యేక చిత్రంతో ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు.
Tabu | టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా ‘కింగ్ 100’తో బిజీగా ఉన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నాగ్.. ఈ ప్రత్యేక చిత్రంతో ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి టబు కూడా కీలక పాత్రలో నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కాగా, నాగార్జున, టబు కాంబోకి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు, ముఖ్యంగా వారి మధ్య కనిపించిన తెరపై కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే నాగార్జున సినిమాలో టబు నటించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఇన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈసారి వీరిద్దరి మధ్య గతంలో మాదిరిగా రొమాంటిక్ సన్నివేశాలు కాకుండా, బలమైన సంఘర్షణ ఉండబోతున్నట్లు పాత్రల పరిచయం చూస్తే అర్థమవుతోంది. కథలో టబు పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ ఈ సినిమాలో టబును ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే శక్తిమంతమైన పాత్రలో చూపించారు. ఆమె పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోలోనే అదిరిపోయే ఎలివేషన్లు కనిపించాయి. కష్టపడే మనుషులు, అదృష్టాన్ని నమ్ముకునే మనుషులు అంటూ రెండు రకాల వ్యక్తులు ఉంటారని, అయితే తాను మాత్రం అదృష్టాన్ని నమ్మనని టబు చెప్పే సంభాషణ పాత్రలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది.
ఈ ఒక్క డైలాగ్‌తోనే ఆమె పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు. నాగార్జున పాత్రకు ధీటుగా టబు పాత్రను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దీంతో సినిమాలో వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ‘కింగ్ 100’కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టబు పాత్ర పరిచయ వీడియోలో వినిపించిన నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పాత్రకు తగ్గట్టుగా బలమైన సంగీతాన్ని అందించడంతో ఆ వీడియో మరింత అట్రాక్టివ్‌గా ఉంది. నాగార్జున స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, టబు పవర్ఫుల్ పాత్ర, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా రూపొందిస్తున్నారు. ఆయన వందో సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నాగార్జున, టబు మధ్య ఎలాంటి సంఘర్షణ ఉండబోతోంది? కథలో వీరిద్దరి పాత్రలు ఎలా సాగనున్నాయి? అనేది తెరపై చూడాల్సిందే. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత నాగ్, టబు కలిసి నటిస్తుండటం ‘కింగ్ 100’కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

