ఆర్ఎస్పీ ఫిర్యాదుపై సుప్రీంకోర్టు స్పందన
కేంద్ర మంత్రి బండి సంజయ్ క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ ఏడాది గడిచినా వెబ్సైట్లో అప్లోడ్ కాకపోవడం పట్ల తాను చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు స్పందించిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు.
- బండి సంజయ్ క్వాష్ పిటిషన్ల ఉత్తర్వుల కాపీపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి బండి సంజయ్ క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ ఏడాది గడిచినా వెబ్సైట్లో అప్లోడ్ కాకపోవడం పట్ల తాను చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు స్పందించిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించినట్టు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దాఖలు చేసి న క్వాష్ పిటిషన్లను 2025 నవంబర్ 20న హై కోర్టు విచారించి, ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాలేదని ప్రవీణ్‌కుమార్ ఆగస్టు 3న హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 7న వినతిపత్రాలు ఇచ్చి, ఆర్టీఐ దరఖాస్తు కూడా చేశారు. అయినప్పటికీ సమాచారాన్ని నిరాకరించడంతో అక్టోబర్ 30న మొదటి అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై డిసెంబర్ 1న విచారణ జరుగనున్నది.
2026 మే 29న సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పూర్తి తీర్పులను 24 గంటల్లో, ఆపరేటివ్ భాగం ప్రకటించినప్పుడు 15 రోజుల్లోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కానీ, హై కోర్టు తీర్పును అప్లోడ్ చేయకపోవడంతో ఉత్తర్వుల కాపీ లేకుండా అప్పీల్ ఎలా సాధ్యమని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. దీనిపై బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తులపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, పారదర్శకత కోసమే ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

