ఎస్సీ, ఎస్టీ చట్టం కింద చర్యలను కోర్టు నిలిపివేయొచ్చు: సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: నేర స్వభావం ప్రాథమికంగా వ్యక్తిగతం/సివిల్ అయినప్పుడు లేదా బాధితుడి కులంతో సంబంధం లేకుండా జరిగినప్పుడు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు దోషిగా నిర్ధారించిన ఓ వ్యక్తిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద చర్యలను నిలిపివేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులు అవమానాలు, వేధింపులకు గురికాకుండా కాపాడేందుకు ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని తీసుకువచ్చారని, అదే సమయంలో నేర స్వభావం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైకోర్టు దోషిగా నిర్ధారించిన వ్యక్తికి, పొరుగు మహిళకు మధ్య స్థల వివాదం ఉంది. ఆ నేపథ్యంలో జరిగిన గొడవలో ఆమెపై అతను ఇటుక విసరడంతో పాటు, ఆమె కులాన్ని దూషించాడు. ఆమె ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు పెట్టింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సదరు వ్యక్తి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఇరువురి మధ్య రాజీ కుదిరిందని కోర్టుకు ధ్రువపత్రం సమర్పించాడు. నిందితుడి సామాజిక, ఆర్థిక వెనుకబాటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అతడిపై చర్యలను నిలిపివేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- sc st act
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

