బిల్కిస్ బానో కేసు.. గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల్ని రిలీజ్ చేసిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 11 మంది నిందితుల రిలీజ్ గురించి వివరణ ఇవ్వాలంటూ గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పంద్రాగాస్టు రోజున బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. కాలం చెల్లిన రెమిషన్ విధానం ప్రకారం వారిని రిలీజ్ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. గుజరాత్ ప్రభుత్వ తీరును విపక్షాలు ఖండిస్తూ నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితుల విడుదల గురించి వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. ఆ కేసులో 11 మంది నిందితులుగా ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

