‘పెద్దన్న’ తర్వాత రజనీకాంత్ తదుపరి సినిమా ఏమిటన్నది కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పాండిరాజ్, వెంకట్‌ప్రభుతో పాటు పులువురు దర్శకులు రజనీకాంత్‌కు కథలు వినిపించినట్లు వార్తలొస్తున్నాయి. గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని కొత్తదనంతో కూడిన కథాంశాల కోసం ఎదురుచూస్తున్న ఆయన తాజాగా ‘షమితాబ్’, ‘చీనికమ్’ ఫేమ్ ఆర్ బాల్కి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సామాజిక ఇతివృత్తంతో దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో రజనీకాంత్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించబోతున్నట్లు తెలిసింది. దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్-ఇళయరాజా కలయికలో రూపొందనున్న చిత్రమిది కావడం గమనార్హం.