Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి నీటి విడుదల
Srisailam Project | నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
అమరావతి : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు ( Srisailam Project ) 8 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల( Jurala) , సుంకేశుల ( Sunkesula ) నుంచి శ్రీశైలానికి 2.93 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా స్పిల్‌వే నుంచి 2.16 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగుల వరకు నీరుంది.
ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215. 80 టీఎంసీలకు ప్రస్తుతం 203.40 టీఎంసీల నీరు నిలువ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 65,972 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. విద్యుదుత్పత్తి కోసం 10 గేట్లు ఎత్తి 16,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పులిచింత ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.44 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 2.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 39.83 టీఎంసీల నీరు నిలువ ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

