Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
Free Data Engineering Course | :తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం పూర్తిగా ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తోంది.
Free Data Engineering Course | హనుమకొండ, అక్టోబర్ 18:తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం పూర్తిగా ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తోంది. డేటా ఇంజినీరింగ్ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పట్టభద్రులకు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఎవరెవరు అర్హులు?
2022 నుంచి 2026 మధ్య ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులు ఈ శిక్షణకు అర్హులు. తరగతులు హైదరాబాద్లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. మూడు దశాబ్దాల బోధనా అనుభవం ఉన్న అధ్యాపకులు అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారు.
90 రోజుల పాటు శిక్షణ
మొత్తం 90 రోజుల పాటు జరిగే ఈ కోర్సులో బేసిక్, అడ్వాన్స్డ్ పైథాన్, ఎస్క్యూఎల్, ఏఐ టూల్స్, డేటా ఇంజినీరింగ్ అంశాలతో పాటు సాఫ్ట్ స్కిల్స్, కెరీర్ కౌన్సెలింగ్లో శిక్షణ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక సహాయం కూడా అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
గత బ్యాచ్లో 100 మందికిపైగా ఉద్యోగాలు
గత బ్యాచ్లో 350 మందికిపైగా పట్టభద్రులు శిక్షణ పొందగా, వారిలో 100 మందికిపైగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సాంకేతిక రంగంలో నైపుణ్యాల కొరతను తగ్గించడంతో పాటు తెలంగాణ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.

Satyasai Dakshata
రిజిస్ట్రేషన్ వివరాలు
ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు www.dakshata.ai వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9052372023 నంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. ఈ కోర్సుకు ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

