న్యూఢిల్లీ: చైనాకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ కార్గో విమానాన్ని మధ్యలోనే దారి మళ్లించారు. ఆ విమానం కోల్‌కతాకు చేరుకున్నది. విమానంలో ఉన్న వెదర్ రేడార్ ఫెయిల్ కావడం వల్ల మళ్లీ వెనక్కి రప్పించారు. స్పైస్ జెట్ బోయింగ్ 737 కార్గో విమానం కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. అయితే జూలై అయిదో తేదీన టేకాఫ్ తీసుకున్న తర్వాత ఆ విమానంలో వెదర్ రేడార్ పనిచేయలేదు. దీంతో ఆ విమానాన్ని వెనక్కి తీసుకువచ్చే నిర్ణయం తీసుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది.