Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
Special Trains | తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురును అందించింది.
అమరావతి : తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) తీపి కబురును అందించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రకు వెళ్లే ప్రజకుల ప్రత్యేక రైళ్లను ( Special Trains ) నడుపనున్నట్లు వెల్లడించింది. చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డుకు జనవరి 10,17, తిరుగు ప్రయాణంలో 11,18వ తేదీల్లో రైళ్లను నడిపిస్తున్నట్లు వివరించింది.
07119 అనే నంబర్ గల చర్లపల్లి-శ్రీకాకుళం రైలు 10, 17 తేదీల్లో సాయంత్రం 4.20 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుందని వెల్లడించింది. 07120 అనే నంబర్ గల రైలు శ్రీకాకుళం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని స్పష్టం చేసింది.
ఈ రైలు సర్వీసులు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగనుందని రైల్వే అధికారులు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

