టాటా సన్స్‌కు సుప్రీం అనుకూలం.. కష్టాల్లో సైరస్ మిస్త్రీ

న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ.. ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో మిస్త్రీ సారథ్యంలోని షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ పరిశ్రమల భవితవ్యంపై ప్రభావం పడనున్నది. అయితే, టాటా సన్స్‌లో మైనారిటీ వాటాదారుగా ఎస్పీ గ్రూప్ చేస్తున్న వాదన.. రెండు సంస్థల మధ్య మరో న్యాయ పోరాటానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏడు దశాబ్దాలుగా టాటా సన్స్‌లో మైనారిటీ వాటా దారు (18.4 శాతం)గా ఎస్పీ గ్రూప్.. తన వాటా విలువ రూ.1.78 లక్షల కోట్ల పై చిలుకు ఉంటుందని వాదిస్తున్నది. కానీ టాటా సన్స్ మాత్రం రూ.60 వేల కోట్లు మాత్రమేనని పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలో తమ సంస్థలో ఎస్పీ గ్రూప్ వాటాలు, వాటి విలువపై ముందడుగు వేయకుండా గతేడాదే టాటా సన్స్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
టాటా సన్స్‌కు అనుకూలంగా శుక్రవారం తీర్పు చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ సంస్థలో ఎస్పీ గ్రూప్ వాటాలు, దాని విలువ చెల్లింపు అంశంపై మరో న్యాయ ప్రక్రియ ద్వారా తేల్చుకోవాలని పేర్కొనడం గమనార్హం. టాటా సన్స్‌లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరిన సైరస్ మిస్త్రీ ఆశలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నీళ్లు చల్లింది.
ఇప్పటికే రుణాల ఊబిలో చిక్కుకున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళికతో బ్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఆస్తుల విక్రయం ద్వారా సుమారు 10 వేల కోట్ల నిధులు సమకూర్చుకుంటామని, వాటిని రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని బ్యాంకర్లకు ఎస్పీ గ్రూప్ తెలిపినట్లు సమాచారం.
యురేకా ఫోర్బెస్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సొలార్, అఫ్కాన్స్ ఇన్ప్రాస్ట్రక్చర్ సంస్థల్లో వాటాలను ఎస్పీ గ్రూప్ విక్రయించనున్నది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. బ్యాంకర్లకు సుమారు రూ.23,500 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉన్నదని సమాచారం.
ఇవి కూడా చదవండి:
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Cyrus Mistry
- Tata Sons
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

