విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం : కలెక్టర్ రాహుల్ శర్మ
విద్య ద్వారానే వ్యక్తిగత వికాసంతో పాటు సమాజం, దేశాభివృద్ధి సాధ్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
మహాదేవపూర్ (భూపాలపల్లి), నవంబర్ 11 : విద్య ద్వారానే వ్యక్తిగత వికాసంతో పాటు సమాజం, దేశాభివృద్ధి సాధ్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి సందర్భంగా బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మౌలానా ఆజాద్ విద్యాభివృద్ధికి, జాతీయ సమగ్రతకు, మతసామరస్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మైనారిటీ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ కుమారస్వామి, అధికారులు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం : కలెక్టర్ రాహుల్ శర్మ
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
Lizards | ఇంట్లో బల్లులు ఇరిటేట్ చేస్తున్నాయా.. ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ పరార్..!
Running | 40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Watch: తండ్రి, కూతురిని కారులో వెంబడించి.. కాల్పులు జరిపిన వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

