Sleeping | మీరు రోజూ ఆలస్యంగా నిద్రిస్తున్నారా.. అయితే మీకు మానసిక సమస్యలు తప్పవు!
రాత్రి ఒంటి గంట వరకు మేలుకుని, తెల్లారి ఆలస్యంగా నిద్ర నుంచి లేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
Sleeping | న్యూఢిల్లీ: రాత్రి ఒంటి గంట వరకు మేలుకుని, తెల్లారి ఆలస్యంగా నిద్ర నుంచి లేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. వీరు ఈ అధ్యయనంలో భాగంగా బ్రిటన్లోని 73,000 మంది వయోజనులను పరిశీలించారు. త్వరగా నిద్ర నుంచి మేలుకోవడం, ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం, నిద్రపోయే సమయం వంటి వాటిని విశ్లేషించారు. నిద్రపోయే వేళలు, మానసిక ఆరోగ్యం, ప్రవర్తనలో నిలకడ లేకపోవడం వంటి వాటికి పరస్పర సంబంధం ఉందని వెల్లడైంది.
రాత్రి ఒంటి గంట తర్వాత నిద్రకు ఉపక్రమించి, తెల్లవారిన తర్వాత ఆలస్యంగా నిద్ర నుంచి లేచి, రాత్రి వేళల్లో చురుగ్గా ఉండేవారి మానసిక ఆరోగ్యం కన్నా రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించి, తెల్లవారిన తర్వాత త్వరగా నిద్ర నుంచి మేలుకుని, పగటి సమయంలో చురుగ్గా ఉండేవారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది. రాత్రి ఒంటి గంట తర్వాత నిద్రకు ఉపక్రమించేవారు నిర్ణయాలు తీసుకోవడంలో, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారని వెల్లడైంది. ఈ పరిస్థితికి ఇతర మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన వంటివాటితో కూడా సంబంధం ఉంటుంది. ఇటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడాలంటే, నిద్రకు ఉపక్రమించే సమయంలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు సూచించారు. వారి సూచనల ప్రకారం మొదటి వారంలో 15 నిమిషాల ముందు నిద్రకు ఉపక్రమించాలి. ఇదే విధంగా క్రమంగా త్వరగా నిద్రపోయేలా అలవాటు చేసుకోవాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

