న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా..దేశీయ మార్కెట్లోకి మరో మూడు మోడళ్ళను పరిచయం చేసింది. స్లావియా పేరుతో విడుదల చేసిన ఈ మోడళ్ళు మూడు రకాల్లో లభించనున్నాయి. రూ.10.69 లక్షల ప్రారంభ ధరతో రూ.15.39 లక్షల గరిష్ఠ ధరతో వీటిని దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాలకు పోటీగా సంస్థ ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో లీటర్ ఇంజిన్ కలిగిన టీఎస్ఐ రకంలో యాక్విట్ వెర్షన్ రూ.10.69 లక్షలు, అంబిషన్ మోడల్ రూ.12.39 లక్షల నుంచి రూ.13.59 లక్షల లోపు, ైస్టెల్ వెర్షన్ రూ.13.59 లక్షలకు లభించనున్నది. దీంట్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీఎస్తో ఏబీఎస్, ఈఎస్సీ, రియర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.