వరంగల్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
వరంగల్ హత్య కేసులో ఆరుగురి అరెస్ట్ | నగరంలోని ఎల్బీనగర్ హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ముగ్గురి హత్య కేసులో ఆరుగురు నిందితులు మహమ్మద్ షఫీ, బోయిని

హనుమకొండ : నగరంలోని ఎల్బీనగర్ హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. ముగ్గురి హత్య కేసులో ఆరుగురు నిందితులు మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండీ సాజిద్, రాగులు విజేందర్, ఎండీ మీర్జా అక్బర్, ఎండీ పాషా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుడు అన్న చంద్ పాషా, హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు తమ్ముడు షఫీ మధ్య పశువుల కొనుగోలు, ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు. నిందితుల నుంచి వేట కత్తులు, కోత మిషన్, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.
పోలీసుల కథనం ప్రకారం..
చాంద్‌పాషా, షఫీ సోదరులు పాతికేళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నారు. రూ.కోటి లావాదేవీలకు సంబంధించి వీరిమధ్య వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలో ఎండీ షఫీ, అతని అనుచరులు ఆరుగురితో కలిసి బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆటోలో ఎల్బీనగర్లోని చాంద్‌పాషా ఇంటికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న ఇనుప రంపంతో తలుపులను కోశారు. చాంద్‌పాషా, అతని భార్య సాబీరా, బావమరిది ఖలీల్‌పై కారంపొడి చల్లి కత్తులు, ఇనుప రంపం తో దాడిచేశారు. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అక్కడే ఉన్న చాంద్‌పాషా కూతురు రూబీనా (హీనా) చంపొద్దని బాబాయి షఫీని ప్రాధేయపడింది. హీనాను వదిలేసిన షఫీ మరో గదిలో పడుకున్న చాంద్‌పాషా కొడుకులు ఫహద్, సమద్‌పై కూడా దాడికి దిగారు. ఇద్ద రూ తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి బాధితులను దవాఖానకు తరలించారు.
మృతుల్లో ఒకరైన ఖలీల్ది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం. మంగళవారం వరంగల్ వచ్చి ఇంటికి వెళ్తుండగా రైలు మిస్సయ్యింది. దీంతో సోదరి సాబీరా ఇంట్లో ఉన్నా డు. ఈ క్రమంలో షఫీ చేతుల్లో హత్యకు గురయ్యాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

