Shreyas Iyer : భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అబూదాబీలో విహరిస్తున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ అక్కడి యాస్ మరినా సర్క్యూట్(Yas Marina Circuit)లో ఫార్ములా వన్ రేసును వీక్షించాడు. ఆదివారం ప్రతిష్ఠాత్మక గ్రాండ్ ప్రిక్స్ ఫైనల్(Grand Prix Final)కు ముందు అయ్యర్ తన అభిమాన డ్రైవర్ చాంపియన్ రెడ్ బుల్ డ్రైవర్(Red Bull Driver) మాక్స్ వెర్స్టాపెన్(Max Verstappen)కు తన జెర్సీని బహూకరించాడు. అనంతరం ఫార్ములా వన్ దిగ్గజంతో ఫొటోలు దిగాడు. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సీజన్లో అదరగొడుతున్న వెర్స్టాపెన్ ఆదివారం జరిగిన ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఈసారి అతడికి ఇది 19వ టైటిల్ కావడం విశేషం.వెర్స్టాపెన్ ఈ ఏడాది 22 టోర్నీల్లో పాల్గొన్నాడు. ఓవరాల్‌గా అతడికి ఇదిది 54వ టైటిల్. ఈ ట్రోఫీతో వెర్స్టాపెన్ అత్యధిక టైటిల్స్ సాధించిన రేసర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. లూయిస్ హామిల్టన్(103), మైకేల్ షుమాకర్(91) మాత్రమే అతడి కంటే ముందున్నారు.
శ్రేయస్ అయ్యర్
ఈ ఏడాది ఆసియా కప్‌తో పునరామనం చేసిన అయ్యర్.. వరల్డ్ కప్‌లో దంచికొట్టాడు. భారత జట్టును వేధిస్తున్న నాలుగో స్థానానికి న్యాయం చేస్తూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒక సెంచరీతో కలిపి ఈ యంగ్‌స్టర్ 530 పరుగులు సాధించాడు. అయితే.. కీలకమైన టైటిల్ పోరులో అయ్యర్(4) విఫలమయ్యాడు. భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో ఛేదించి ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది.