Rain Update | రాష్ట్రంలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
- వాతావరణ శాఖ హెచ్చరిక
Rain Update | హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అల్పపీడనం రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీంతో ఏపీతో పాటు తెలంగాణ రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వర్షాలు పేర్కొంది. నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, జగిత్యాల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్టు వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా 83% లోటు వర్షపాతం
ఈశాన్య రుతుపవనాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 83 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం 117.5 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 20.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అత్యల్ప వర్షపాతం నిర్మల్ జిల్లాలో 0.6 మి.మి, ఆ తర్వాత వరుసగా జగిత్యాల జిల్లాలో 2 మి.మి, పెద్దపల్లిలో 5.7 మి.మి, రాజన్నసిరిసిల్లలో 7 మిల్లీమీటర్లు, సిద్దిపేటలో 9.3, మెదక్ 12.2, కరీంనగర్ 12.7 , మహబూబ్‌నగర్‌లో 13.8, ఆదిలాబాద్‌లో 15.4, కామారెడ్డిలో 15.7 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వైరాలో 4.5 మిల్లీమీటర్లు, కొణిజర్ల 2.4, బోనకల్లో 2, భద్రాద్రి కొత్తగూడెం ముల్కలపల్లెలో 3.4, సూర్యాపేట జిల్లా కోదాడలో 1.8, తిరుమలగిరిలో 0.5, సూర్యాపేటలో 0.2, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 1 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 95.8 మిల్లీమీటర్లు కాగా, 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవంబర్‌లో ఇప్పటి వరకు 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Thinning | జుట్టు రాలకపోయినా పలుచబడుతోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నిరుద్యోగులకు ‘ప్రెసిడెన్షియల్’ షాక్.. 4 జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థుల కడుపుకొట్టిన కాంగ్రెస్!
Sai Pallavi | ఇకపై ఆచితూచి మాట్లాడతా.. వివాదాలపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. దుబాయ్ షెడ్యూల్ హైదరాబాద్‌కు మార్పు!
Solar Pumpsets | వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు.. అధికారులకు రెడ్కో సీఎండీ కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

