మాజీ హోంమంత్రికి షాక్.. 12 వరకు ఈడీ కస్టడీ
Former Maharashtra Home Minister Anil Deshmukh | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదివారం బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను

ముంబై : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదివారం బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి ఈ నెల 12వ తేదీ వరకు ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపింది. శనివారం పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు శనివారం మాజీ హోంమంత్రిని కస్టడీని పొడగించేందుకు నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో 12 గంటల పాటు విచారించిన అనంతరం ఈ నెల 1న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో ఈడీ పలుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు.
ఈ విషయంలో బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. మాజీ మంత్రికి ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో చివరకు ఆయన సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయనను మంగళవారం ప్రత్యేక కోర్టులో హాజరు పరుచగా.. ఈ నెల 6 వరకు ఈడీ కస్టడీకి పంపింది. మరో వైపు సీబీఐ కూడా అనిల్ దేశ్‌ముఖ్‌ను కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. మాజీ మంత్రిపై దర్యాప్తు సంస్థ ఏప్రిల్‌లో కేసు నమోదు చేసింది. అదే సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే ద్వారా ముంబైలోని వివిధ బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.4.70కోట్లకుపైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

