Shafali Verma : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) రికార్డు అర్ధ శతకం సాధించింది. గురువారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన ఈ డాషింగ్ బ్యాటర్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేసింది. బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించిన లేడీ సెహ్వాగ్ .. టీమిండియా తరఫున రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు .. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ మెరుపు బ్యాటింగ్‌కు రికార్డులు దాసోహవుతున్నాయి. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో బంగ్లాదేశ్ బౌలర్లపై రెచ్చిపోయిన షఫాలీ.. 29 బంతుల్లో అర్ధశతకం అందుకుంది. పొట్టి వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలకు ఇదే రెండో వేగవంతమైన ఫిఫ్టీ.
Do not bowl her there! 🔥🥵#ShafaliVerma is making the run-chase look easy as she dispatches a fuller delivery for a MAXIMUM! 💥😮
ICC Women’s #T20WorldCup 2026 | #INDvBAN | LIVE NOW! pic.twitter.com/GoLJAmT1My
— Star Sports (@StarSportsIndia) June 25, 2026
షఫాలీ కంటే ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టింది. 2024 ఎడిషన్‌లో హర్మన్‌ప్రీత్ ఈ రికార్డు సాధించగా.. 2018లో స్మృతి మంధాన 31 బంతుల్లో యాభై బాదింది. 32, 33 బంతుల్లో అర్ధ శతకాలు బాదింది హర్మన్‌ప్రీత్.