గిరిజన మహిళపై లైంగికదాడి

తుంగతుర్తి, నవంబర్ 21: గిరిజన మహిళపై ఇటీవల పలువురు సామూహిక లైంగికదాడికి పాల్పడగా.. బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (36) భర్త నుంచి వేరుగా ఉంటూ కుమార్తె, కుమారుడితో కలిసి జీవిస్తున్నది. గ్రామంలోనే కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. ఈ నెల 17న రాత్రి అదే గ్రామానికి చెందిన గుగులోతు సోమ్లానాయక్.. ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఆ రాత్రి అతనితోపాటు మరో ఇద్దరు బాధితురాలిపై లైంగిక దాడిచేశారు. అనంతరం తీవ్ర కడుపునొప్పి, వాంతులతో ఈ నెల 19న ఉదయం బాధితురాలు తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స పొందింది. అయినా పరిస్థితి మారకపోవడంతో ఆమెను సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. బాధితురాలి కుమార్తె, కొడుకు ఫిర్యాదు మేరకు తుంగతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నారు. మహిళ మృతితో కోపోద్రిక్తులైన గ్రామస్థులు.. నిందితుడు సోమ్లానాయక్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- tribal woman
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

