జిజ్జు =మొండికేసుడు (ఏందీ పోరడు ఎప్పుడుజూడు జిజ్జుకేస్తనే ఉంటడు. ఎప్పుడూ సంతోషంగా ఉండడు)
నాడెం = నటన (గీ ముసలోని దగ్గర దండిగా నాడెం ఉంది. గిప్పుడే సచ్చినట్టు సేత్తాండు)
బార్ధాన్ = జనప సంచులు (కల్లంల అడ్లు అట్లనే ఆగమైతున్నయ్.. బార్ధాన్లలో నింపి ఇంట్లెయ్యరాదు)
సాగదోలుడు = పంపుడు (తల్లిని పిల్లని కలిపి సంతకు సాగదోలు, లేకపోతే రేటు తక్కువ వడ్తది)
ఇస్సదారి = హక్కుదారు (భూములు పంచినప్పుడు ఏ పాలు మీద ఎవరికి హక్కు ఉంటుందో వాళ్లను ఆ పాలుకు ఇస్సదారి అంటారు)