సముద్ర సందేశం
బయట జోరు గాలులు లోన అలల హోరులు నేనున్నాను అని చాటడానికో తీరాన్ని దాటడానికో
బయట జోరు గాలులు
లోన అలల హోరులు
నేనున్నాను అని చాటడానికో
తీరాన్ని దాటడానికో!
అలుపు లేకుండా అలల్లాగా
మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్న మత్స్యకారులు
ఒళ్లంతా కళ్ళు చేసుకున్న వల
చేపలను పట్టడానికి ఆశల దోసిలిలా!
పిల్లలూ పెద్దలూ అలుపెరగకుండా
నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ
బ్రతుకునిచ్చే మత్స్య దర్శనం!
ఆశతో జీవించుమని గొప్ప సందేశం!
ఆటుపోట్లు కష్టసుఖాలు
అలలు అవిరామ ప్రయత్నాలు
తీరం సేద తీరే కేంద్రం
నీటి నురుగలు గెలుపు నవ్వులు!
విశాలం హృదయమంతా
లోతు మనిషి మనసంతా
సూర్య చంద్రులు తనలోనే
పుట్టినట్లు ఉట్టిపడే నమ్మకం!
నీటి తరంగాల గలగలలు
అందరికీ ఆత్మీయ స్వాగతంలా
బోధిచెట్టు కింద జ్ఞానోదయం
సముద్రపు ఒడ్డున జీవితోదయం!!
జి. జగ్గయ్య
98495 25802
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- G Jaggaiah
- Sea message
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

