ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో అలసత్వాన్ని సహించం
ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో అలసత్వాన్ని సహించమని అధికారులకు రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతిపై శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు.
- తప్పుడు కేసులు నమోదు చేస్తే బాధ్యులపై చర్యలు
- బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
- మెదక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
మెదక్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో అలసత్వాన్ని సహించమని అధికారులకు రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతిపై శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, రాజకీయ కక్షలతో కేసుల పేరిట వేధింపులకు గురిచేస్తే సహించమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులను యంత్రాంగం అరికట్టాలన్నారు.
నర్సాపూర్, పెద్దచింతకుంట గిరిజనులపై జరిగిన దాడి కేసులపై కేసుల విచారణలో ఐవోలు మార్చాలని ఎస్పీని ఆదేశించారు. మెదక్ పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి మార్చి 26 వరకు నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. హవేళీఘనపూర్లో నెలకొన్న భూసమస్యను 45 రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. సైబరాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్లో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశామన్నారు. మెదక్ పట్టణంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షాప్ల నిర్మాణం చేపట్టాలన్నారు.
అనంతరం నర్సాపూర్ మండలం మమతాబాద్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను చైర్మన్ బక్కి వెంకటయ్య తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, అదనపు కలెక్టర్ నగేశ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు విజయలక్ష్మి, సింధు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

