Mukaab | సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న సౌదీ.. లక్షల ఇల్లు, 9 వేల హోటల్స్‌తో ముకాబ్ నిర్మాణం
Mukaab | అవతార్ సినిమాల్లో చూపినట్టు మనకంటూ ఒక కొత్త ప్రపంచం ఉంటే.. అందులోని బిల్డింగులన్నీ ఒకే ఆకారంలో ఉంటే.. అదీ ఈ ప్రపంచంలో మరెక్కడా లేనట్టు ఉంటే.. చూడ్డానికి రెండు కండ్లు చాలవు. ఆ 20 బిల్డింగులను కప్పుతూ ఒక ఆకారం.. అందులోనే రెస్టారెంట్లు, మ్యూజియాలు, యూనివర్సిటీలు.. మొత్తంగా ఒక ప్యాకేజీలా ఉండే మెగా ప్రాజెక్టు చేపట్టబోతున్నది సౌదీ అరేబియా ప్రభుత్వం.
Mukaab | ఇరుకిరుకు ఇండ్లు.. రూపురేఖలు లేని అపార్ట్మెంట్లు.. అడ్డదిడ్డంగా రోడ్లు.. అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థలు.. ప్రపంచమంతా ఇదే తంటా. అచ్చం అవతార్ సినిమాల్లో చూపినట్టు మనకంటూ ఒక కొత్త ప్రపంచం ఉంటే.. అందులోని బిల్డింగులన్నీ ఒకే ఆకారంలో ఉంటే.. అదీ ఈ ప్రపంచంలో మరెక్కడా లేనట్టు ఉంటే.. చూడ్డానికి రెండు కండ్లు చాలవు. ఆ 20 బిల్డింగులను కప్పుతూ ఒక ఆకారం.. అందులోనే రెస్టారెంట్లు, మ్యూజియాలు, యూనివర్సిటీలు.. మొత్తంగా ఒక ప్యాకేజీలా ఉండే మెగా ప్రాజెక్టు చేపట్టబోతున్నది సౌదీ అరేబియా ప్రభుత్వం. రాజధాని రియాద్‌లో ‘ముకాబ్’ పేరుతో మహాద్భుత కట్టడానికి సిద్ధమైంది.
రియాద్, ఫిబ్రవరి 20: ప్రపంచంలో మరెక్కడా లేని గొప్ప సౌధాన్ని నిర్మించే భారీ ప్రాజెక్టుకు సౌదీ అరేబియా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ దేశ రాజధాని రియాద్‌లో 400 మీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తుతో అత్యంత భారీ ఘనాకార నిర్మాణాన్ని చేపట్టనున్నది. దానికి ముకాబ్ అని నామకరణం కూడా చేసింది. ఆ భవనం కింది భాగంలో ఉండే పట్టణాన్ని న్యూ మురబ్బా అని పేర్కొన్నది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను సౌదీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నది. ఆ బిల్డింగ్‌లో అంతలా ఏమున్నదంటే.. లక్ష ఇండ్లుంటాయి, వేల కొద్దీ హోటళ్లుంటాయి, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్ ఉంటాయి. ఆఫీసులు, మ్యూజియాలు, కమ్యూనిటీ అవుట్‌లెట్లుంటాయి. అంతేకాదు.. చదువుకోవడానికి ఏకంగా ఒక యూనివర్సిటీనే ఉంటుంది. చతురస్రాకారంలో ఉండే ముకాబ్‌లో 20 ఎంపైర్ స్టేట్ బిల్డింగులను నిర్మించనున్నారు. దీన్ని 2030 నాటికి సిద్ధం చేస్తామని ఆ దేశ సర్కారు చెప్తున్నది. ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని, నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొనేందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో మార్స్‌పైకి వెళ్లాలనిపిస్తే, ఇక్కడి నుంచే వెళ్లేలా ఏర్పాట్లు కూడా చేయనున్నది.
ముకాబ్ విశేషాలు
* 2.5 కోట్ల చదరపు కిలోమీటర్ల ఫ్లోర్ ఏరియా
* 1,04,000 ఆవాసాలు, 9,000 హోటళ్లు
* 9,80,000 చదరపు మీర్ల రిటైల్ స్పేస్
* 14 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్
* 6,20,000 చదరపు మీటర్ల లీజర్ అసెట్స్
* 18 లక్షల చదరపు మీటర్ల ఇతర సదుపాయాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

