భామనే… సత్యభామనే
అందం, అహం, అభిజాత్యం,అమాయకత్వం, జాణతనం,వీరత్వం.. వెరసి సత్యభామ. పరిపూర్ణమైన పురుషుడిగా శ్రీరామ చంద్రుడ్ని కీర్తిస్తారు. అలాగే.. స్త్రీలలో పరిపూర్ణత్వం సత్యభామలో కనిపిస్తుంది.సాక్షాత్ భూమాత అంశగా అవతరించినా..సాధారణ స్త్రీలో ఉండే లక్షణాలన్నీ సత్యభామలో గోచరిస్తాయి.అష్టపత్నులలో తానే ఇష్టసఖినని అనిపించుకోవాలనే ఆరాటం ఆమెది.విశ్వమంతాకోరుకునే కృష్ణప్రేమ తనకు మాత్రమే సొంతం కావాలనేస్వార్థం కూడా ఆమెలో కనిపిస్తుంది! శమంతకమణి దయాలబ్ధమైనఐశ్వర్యాన్ని చూసి మిడిసిపాటు.. ఇలా సాధారణ స్త్రీ లక్షణాలన్నీసత్యలో తొంగిచూస్తాయి.
అందం, అహం, అభిజాత్యం,అమాయకత్వం, జాణతనం,వీరత్వం.. వెరసి సత్యభామ. పరిపూర్ణమైన పురుషుడిగా శ్రీరామ చంద్రుడ్ని కీర్తిస్తారు. అలాగే.. స్త్రీలలో పరిపూర్ణత్వం సత్యభామలో కనిపిస్తుంది.సాక్షాత్ భూమాత అంశగా అవతరించినా..సాధారణ స్త్రీలో ఉండే లక్షణాలన్నీ సత్యభామలో గోచరిస్తాయి.అష్టపత్నులలో తానే ఇష్టసఖినని అనిపించుకోవాలనే ఆరాటం ఆమెది.విశ్వమంతాకోరుకునే కృష్ణప్రేమ తనకు మాత్రమే సొంతం కావాలనేస్వార్థం కూడా ఆమెలో కనిపిస్తుంది! శమంతకమణి దయాలబ్ధమైనఐశ్వర్యాన్ని చూసి మిడిసిపాటు.. ఇలా సాధారణ స్త్రీ లక్షణాలన్నీసత్యలో తొంగిచూస్తాయి.
అదే సమయంలో.. మగువ తలుచుకుంటే ఏదైనా సాధించగలదనే తెగువ సత్యభామలోని అసాధారణ లక్షణం. ఆ పట్టుదలే.. నరక బాధతో చీకటిలో మగ్గుతున్న ప్రాగ్జ్యోతిష పురానికి వెలుగునిచ్చింది. సమస్త మానవాళికీ
దీపావళిని అందించింది. ప్రతి స్త్రీ ఆదిపరాశక్తి అంశే అని ప్రపంచానికి చాటింది. సత్యభామ ఓ విప్లవ
నాయకి. యుగాల క్రితమే స్త్రీవాదాన్ని ప్రపంచానికి చాటిన ఫెమినిస్ట్. అందుకే.. పురాణ ఇతిహాసాల్లో మనకు ఎన్ని గొప్ప స్త్రీపాత్రలు కనిపించినా..సత్యభామ మాత్రం ప్రత్యేకం. యుగయుగాలుగానే కాదు, నేటి స్త్రీలపై కూడా ఆమె ప్రభావం ఉందని చెప్పక తప్పదు.
సత్యభామ రూప లావణ్యాన్నీ, అభిమానధనత్వాన్నీ తమ చిత్రాల ద్వారా ఆవిష్కరించేందుకు ఎందరో చిత్రకారులు ఆరాటపడ్డారు.. నేటికీ ప్రయత్నిస్తున్నారు. వడ్డాది పాపయ్య, బాపు లాంటి జగద్విఖ్యాత చిత్రకారులైతే.. సత్యాదేవి సౌందర్యాన్ని తమ కుంచెలతో అద్భుతంగా ఆవిష్కరించారు. నేటికీ ఆ చిత్రాలు జానాదరణ పొందుతూనే ఉన్నాయి. స్త్రీ సౌందర్యాన్ని ఆవిష్కరించాలంటే చిత్రాకారులకు సత్యభామ రూపాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. ఆ రూపం ద్వారా ఎన్ని భావాలనైనా పలికించొచ్చని చిత్రకారుల అభిప్రాయం. కవుల భావావేశాలకీ, నటీనటుల భావోద్వేగాలకీ, శిల్పుల రససృష్టికీ.. సత్యభామ లక్షణాలు, గుణగణాలు, హావభావాలే బేసిక్ మెటీరియల్స్. వీటిని ఆధారం చేసుకొని గొప్పవాళ్లయిన కళాకారులు కోకొల్లలు.
రంగస్థల పితామహుడు స్థానం నరసింహారావు స్త్రీ పాత్రల్లో ప్రసిద్ధి అయితే.. సత్యభామగా జగత్ విఖ్యాతి సాధించారు. రంగస్థలంపై సత్యాదేవిగా ఆయన్ను చూసి మగాళ్లు మైమరచిపోయేవారట. స్త్రీలైతే.. ఆ సౌందర్యాన్ని చూసి ఈర్ష్య పడేవారట. సత్యభామ పాత్రను ఆయన ఏ స్థాయిలో ప్రేమించారంటే.. ఆ పాత్రలోని అభిజాత్యానికి అద్దం పడుతూ.. ‘మీరజాలగడా.. నా యానతి.. వ్రతవిధాన మహిమన్.. సత్యాపతి.. నటన సూత్రధారీ.. మురారీ.. ఎటుల దాటగలడో.. నా యానతి.. వాదులాడగలడా.. సత్యాపతి..’ అంటూ దశాబ్దాల క్రితమే పాట రాసి, దాన్ని స్వయంగా రంగస్థలంపై అభినయిస్తూ, ఆలపించారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఆ పాటను చివరకు సినిమావాళ్లు సైతం వాడేశారు. సత్యభామ అనగానే ముందు గుర్తొచ్చే పాట ‘మీరజాలగడా..’. ఆ క్రెడిట్ కచ్చితంగా స్థానంవారికే దక్కుతుంది. నాటకరంగంలో ‘పద్మశ్రీ’ అందుకున్న తొలి కళాకారుడిగా స్థానం వారు చరిత్ర సృష్టించారంటే.. అందులో సత్యభామ పాత్ర ప్రభావం చాలా ఉంది.
ఇక తెలుగుతెరపై తొలి సత్యభామగా ఋష్యేంద్రమణి పేరే చెప్పాలి. 1935లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాలో ఆమే సత్యభామ. కపిలవాయి రామనాథశాస్త్రి ఆ సినిమాలో కృష్ణుడిగా నటిస్తే.. కాంచనమాల రుక్మిణి పాత్ర పోషించారు. ఆ సినిమాలో సత్యభామగా ఋష్యేంద్రమణి అభినయాన్ని మేధావులు సైతం కొనియాడారట.
తెలుగింటి సత్యభామ జమున
వెండితెర సత్యభామ అనగానే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు కళాభారతి జమున. సాత్రాజితీదేవిగా జమున అభినయానికి తెలుగు జనం జేజేలు పలికారు. తెలుగులో ఎక్కువ సినిమాల్లో సత్యభామగా నటించిన క్రెడిట్ కూడా జమునదే. ఆమె తొలిసారి సత్యభామగా నటించిన సినిమా ‘వినాయకచవితి’ (1957). ఇక సత్యగా ఆమె నటవిశ్వరూపాన్ని చూపించిన సినిమా ‘శ్రీకృష్ణతులాభారం’ (1966). అలాగే ‘శ్రీకృష్ణ విజయం’ (1971) చిత్రంలోనూ జమున సత్యభామగా మెప్పించారు.
అంతేకాదు.. రంగస్థలంపై కూడా సత్యభామగా ఆమె మెరిశారు. ‘శ్రీకృష్ణతులాభారం’ నాటకాన్ని పదుల సంఖ్యలో ప్రదర్శనలిచ్చారు. స్థానంవారి ‘మీరజాలగడా.. నా యానతి’ గీతాన్ని ఆ నాటకాల్లో స్వయంగా ఆలపిస్తూ అభినయించేవారు జమున. ఆ విధంగా తెలుగింటి సత్యభామగా ఎవరికీ లేనంత కీర్తిని సొంతం చేసుకున్నారామె. ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాలో భర్తృదానవ్రత సన్నివేశంలో భర్తను కోల్పోతున్నానన్న బాధను, సపత్నుల ముందు చులకన అవుతానేమో అనే భయాన్నీ
ఏకకాలంలో పలికించి భళా అనిపించుకున్నారు జమున. ఇక అలకపాన్పుపై ఆమె చూపించిన అభినయం న భూతో న భవిష్యత్. జమునసత్యభామగా నటించిన ప్రతి సినిమాలోనూ కృష్ణుడు ఎన్టీఆరే కావడం విశేషం. కృష్ణుడిగాఎన్టీఆర్, సత్యగా జమున.. ఎంత చూసినాతనివితీరని కాంబినేషన్ ఇది.

Rrrr
వీరనారిగా మహానటి
సావిత్రి ఒకే ఒక్క సినిమాలో సత్యభామగా నటించారు. ఆ సినిమానే ‘దీపావళి’ (1960). ఇందులో వీరనారి సాత్రాజితిగా కనిపిస్తారామె. నిజానికి సత్యభామగా సావిత్రి పలికించినన్ని ఎమోషన్స్ ఏ నటీ పలికించలేదన్నది నిజం. సత్యభామగా ఒకే సినిమాలో నటించినా.. చిరస్మణీయంగా నటించారు సావిత్రి. ముందు అహం, అభిజాత్యం కలగలిసిన సత్యాదేవిగా కనిపిస్తారు. తర్వాత ‘సరియా.. నాతో.. సమరాన నిలువగలడా..’ అంటూ నరకాసురుడికి సవాలు విసిరే వీరనారి సత్యగా కనిపిస్తారు. నరక సంహారం జరిగాక.. ‘అమ్మా…’ అంటూ నరకుడు నేలకొరిగిన సన్నివేశంలో కడుపు కోతతో అల్లాడుతున్న కన్నతల్లిగా దర్శనమిస్తారు. ఈ స్థాయి అభినయం సావిత్రికి మాత్రమే చెల్లు. అందుకే ఆమె మహానటి.
అలకపాన్పు అలివేణి ఎస్.వరలక్ష్మి
‘శ్రీకృష్ణార్జునయుద్ధం’(1963) సినిమాలో సత్యభామగా నటించారు ఎస్.వరలక్ష్మి. నిజానికి ఈ కథలో సత్యభామ పాత్ర నిడివి చాలా తక్కువ. అయినా.. వందేండ్లు గుర్తుండేలా నటించారామె. ఈ సినిమాలో ఓ గమ్మత్తయిన సన్నివేశం ఉంది. కృష్ణార్జున యుద్ధాన్ని నివారించే సాహసం ఎవరూ చేయలేకపోతున్న తరుణంలో.. తన మాట జవదాటడనే నమ్మకంతో కృష్ణుడ్ని వారించేందుకు స్వయంగా సత్యాదేవే రంగంలో దిగుతుంది. ‘ప్రాణేశ్వరా.. ఎవరు వచ్చినా మీరు పలకడం లేదని నేనే వచ్చాను..’ అంటూ అనునయంగా శ్రీకృష్ణుడ్ని పలకరిస్తుంది. ‘సాత్రాజితీదేవీ.. మీరు అభిమానవతులు.. నన్నిప్పుడు అనవసరంగా మాట్లాడించకండి..’ అంటూ గంభీరమైన స్వరంతో సమాధానమిస్తాడు కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్. ‘ఏవండీ.. మీ కోపాలు, నటనలూ నా దగ్గరనా..
నేనూ మీ సత్యనండీ.. నన్ను సంతోషపెట్టడానికైనా నా మాట వింటారు కదూ.. తప్పదు..’ అంటూ బలవంతంగా ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది సత్య. దాంతో ఒక్కసారిగా ఉగ్రుడైన కృష్ణుడు ‘సత్యభామా… నీ వగలు చాలించు.. ఇది అలకగృహం కాదు, ప్రణయకూపం కాదు.. కొలువుకూటం, రణరంగం.. మర్యాదగా వెళ్లు’ అని హూంకరిస్తాడు. ఊహించని ఈ పరిణామానికి ఒక్కసారి హతాసురాలైన సత్యభామ.. అవమాన భారం భరించలేక కన్నీరుమున్నీరవుతూ, బేలగా ఏడుస్తూ ‘మీ ప్రేమలన్నీ నిజమనుకొని.. నా మాటైనా వింటారు కదా అని వస్తే, నలుగురిలో నన్నిలా చులకన చేస్తారా?.. సరేలేండి.. పంతాలు, పౌరుషాలు వచ్చేటప్పటికి పురుషులు పురుషులే అనిపించారు.. ఏమైనా చేసుకోండి.. నాకెందుకీ గొడవ..’ అంటూ వెళ్లిపోతుంది. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్, ఎస్.వరలక్ష్మీల అభినయం అనితరసాధ్యం. నేటికీ ఈ సన్నివేశాన్ని గుర్తుచేసుకొని నువ్వుకునేవాళ్లు చాలామంది ఉన్నారు.
అలాగే.. ‘అలిగితివా.. సఖీ.. ప్రియా.. అలకమానవా..’ పాటలో అలిగిన సత్యగా అలకపాన్పుపై ఎస్.వరలక్ష్మి అభినయం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. తన పాదం పొరపాటున కృష్ణ కిరీటాన్ని తాకినప్పుడు.. అపచారభావంతో లేచి కళ్లకద్దుకునే సందర్భంలో మహాసాధ్వి సాత్రాజితిగా దర్శనమిస్తారు ఎస్.వరలక్ష్మి. ఇక ఆ సినిమాలో ఆమె పాడిన ‘వేయి శుభములు కలుగు నీకూ.. పోయిరావే.. మరదలా..’ పాట నేటికీ జనాదరణ పొందుతూనే ఉన్నది.

Rrrrr2
ఇష్టసఖి జయలలిత
చిత్రకారులు చిత్రీకరించిన సత్యభామ రూపాన్ని వెండితెరపై సాక్షాత్కరించిన ఘనత జయలలితదే. ‘శ్రీకృష్ణసత్య’(1971)లో సత్యభామగా నటించారు జయలలిత. ఈ సినిమా టైటిల్లోనే సత్యభామ పేరుండటం విశేషం. సంపూర్ణకళామూర్తి, అసమాన సౌందర్యరాశి అయిన సత్యభామను ఈ సినిమాలో చూడొచ్చు. సహజంగా జయలలితలో కనిపించే అందం, జాణతనం ఈపాత్ర పోషణకు బాగా ఉపకరించింది. అంతేకాదు, జమున, సావిత్రి, ఎస్.వరలక్ష్మి.. లాంటి దిగ్గజాలు నటించిన ఆ పాత్రను తనదైన శైలిలో సమర్థంగా పోషించి శభాష్ అనిపించుకున్నారు జయలలిత.
ఇంకా ‘శ్రీకృష్ణావతారం’(1967)లో కాంచన, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’(1972)లో వాణిశ్రీ కూడా సత్యభామలుగా మెరిశారు. ఆ విధంగా కొన్నేళ్లపాటు వెండితెరపై సత్యభామ రాజ్యమేలింది. ఇప్పుడున్న ట్రెండ్‌లో తెరపై అందరూ మోడరన్ సత్యభామలే. నేరుగా కనిపించకపోయినా.. పరోక్షంగా నేటి కథానాయిక పాత్రల స్వభావాల్లో సత్యభామ గోచరిస్తూనే ఉన్నది. చివరిగా చెప్పేదేంటంటే.. దైనందిన జీవితంలో బాధ్యతల మధ్య నలిగిపోతూ.. బంధాలకు దూరంగా బతుకుతున్న మనుషుల్ని ఒకచోట చేర్చే మహాపర్వదినంగా పెద్దలు నిర్ణయించిన పండుగ దీపావళి. ఇది ఓ స్త్రీ వీరత్వానికి ప్రతీక. ఓ నారీ విజయభేరి. మనం కాల్చే టపాసులన్నీ నరక సంహారానికి సత్యభామ వాడిన ఆయుధాలకు ప్రతిరూపాలే. సైంటిఫికల్గా కూడా దీపావళి అవసరం మానవాళికి ఎంతైనా ఉన్నది.
ఈ పండుగను ఘనంగా జరిపితే.. క్రిమికీటకాలు అమీబా దశలోనే అంతమై, మానవాళి ఆరోగ్యంగా ఉంటారని సైన్స్ చెబుతున్నది. ప్రపంచదేశాలన్నీ ఈ కాలంలోనే ఏదో ఒక కారణంగా ఈ తరహా వేడుకలను నిర్వహిస్తూ, టపాసులు కాలుస్తూనే ఉన్నాయి. ఇది పెద్దలిచ్చిన వారసత్వ వైభవం. అందుకే దీపావళిని కులమతరహితంగా ఘనంగా జరుపుకొందాం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

