Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో సర్వదర్శనం
Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో సర్వదర్శనం | శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఈ నెల 18 నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.

శ్రీశైలం : శ్రీశైల మల్లన్న క్షేత్రంలో బుధవారం నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా, సామూహిక అభిషేకాలు నాలుగు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించనున్నారు. అభిషేకంతో పాటు దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ ఆన్లైన్, కరెంటు బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఈఓ తెలిపారు.
ఆర్జిత కుంకుమార్చన, నవావరణ అర్చన, వృద్ధ మల్లికార్జునస్వామి వారి ఆర్జిత అభిషేకాలు పరిమిత సంఖ్యలో కొనసాగనున్నాయి. బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా అంటే ఉదయం 7 గంటలకు తొలి విడుత, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో విడుత, తిరిగి రాత్రి 7.30 గంటలకు మూడో విడుత బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. బ్రేక్ దర్శనానికి రూ.500 టికెట్‌గా నిర్ణయించారు. వేద ఆశీర్వచనం కూడా పునః ప్రారంభంకానుండగా.. రోజుకు నాలుగు విడుతలుగా వేద ఆశీర్వచనం నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది.
ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించాలని సూచించింది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని దేవస్థానం కోరింది. భక్తులకు నిరంతరం ఉచిత ప్రసాద వితరణ కొనసాగిస్తామని చెప్పింది. వేకువ జామున దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి స్వామి అమ్మవార్ల ఏకాంత సేవ ముగిసే వరకు భక్తులకు ఉచిత ప్రసాదం అందజేస్తామని ఈఓ కేఎస్ రామారావు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

