గోమయంబగు గొబ్బెమ్మ కొలువుజేరి
గంగిరెద్దులాట శుభమంగళము గొలుప
బాలల తల నిమిరి రేగుపళ్ళు మెరయ
రాగరంజిత సిరులొల్కె భోగివాణి
నల్ల నువ్వుల పిండితో నలుగునొంది
వేకువను తలంటి రవికి మోకరిల్లి
ముంగిలి హసించు ముత్యాల ముగ్గులల్లు
కాంతల నడుమనిల్చె సంక్రాంతి లక్ష్మి
పసుపు కుంకుమలిడి పశువుల పూజించి
పాల పొంగిలి పొలి చేల జల్లి
పంటకాపు నెడద పరవశంబున పొంగ
కనికరమున గాంచె కనుమ గౌరి
రాకుమార: 95501 84758