కథానాయకుడి పాత్రను బోల్డ్‌గా చూపించడం సందీప్‌రెడ్డి వంగా ైస్టెల్. అంతేకాదు, యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా పరిధులకు మించే ఉంటుంది. అందుకే యువతరానికి సందీప్‌రెడ్డి వంగా సినిమా అంటే పూనకాలు వచ్చేస్తుంటాయి. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా అవతరించారు సందీప్. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కాప్‌గా చేయడం ఇదే ప్రథమం. దాంతో అభిమానులు ‘స్పిరిట్’కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ ఎరుగని యాక్షన్ సీక్వెన్స్‌ని ‘స్పిరిట్’లో చూడబోతున్నట్టు చిత్రబృదం చెబుతున్నది.
‘దురంధర్- 2’ని మించిన యాక్షన్ సీక్వెన్స్ ‘స్పిరిట్’లో ఉంటాయట. ఇందులోని యాక్షన్ కొరియన్ థ్రిల్లర్స్‌ని తలపిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొరియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కూడా ‘స్పిరిట్’ కోసం పనిచేస్తున్నారట. ఇదిలావుంటే.. ఈ సినిమాలో సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన స్వరాలను అందించారని చెబుతున్నారు. ఇటీవలే ప్రభాస్ పరిచయ గీతాన్ని కూడా చిత్రీకరించారట. ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానున్నది.