హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ ఏడాది 8,424(25%) సీట్లు నిండలేదు. వీటిలో అత్యధికంగా 6,887 సీట్లు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోనే ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 1,537 సీట్లు ఖాళీగా ఉన్నాయి. పాలిసెట్ తుది విడత సీట్లను శుక్రవారం కేటాయించారు.
112 కాలేజీల్లో 33,535 సీట్లుండగా, తుది విడత సీట్ల భర్తీ తర్వాత 25,111(75%) సీట్లు భర్తీకాగా, 8వేలకు పైగా సీట్లు నిండలేదు. సీట్లు దక్కించుకున్న వారు ఈ నెల 23వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్ట్చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సూచించారు.