కాజీపేట్ డివిజన్ మంజూరు చేయండి : ఎంపీ బండా ప్రకాశ్

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఎంతో సహకరిస్తున్నదని టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాశ్ తెలిపారు. రైల్వేశాఖ పనితీరుపై ఇవాళ రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆదాయార్జనలో దేశంలో రెండవ స్థానంలో ఉందన్నారు. ఎస్సీఆర్లో అయిదు డివిజన్లు ఉన్నాయని, దాంట్లో రెండు ఆంధ్రా, రెండు తెలంగాణ, ఒకటి నాందేడ్‌లో ఉన్నాయన్నారు. అయితే ఆంధ్రా జోన్లలో ఉన్న డివిజన్లకు అధిక సంఖ్యలో కేటాయింపు ఇచ్చారని ప్రకాశ్ తెలిపారు. ఆంధ్రాకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ తెలంగాణ ఏమీ ఇవ్వడం లేదన్నీరు. సికింద్రాబాద్ డివిజన్లో .. కోల్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటి నుంచి రవాణా చార్జీలు బోలెడు వస్తున్నాయన్నారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచాలన్నారు. కాజీపేట్‌ను డివిజన్‌గా ప్రకటించాలని ఎంపీ ప్రకాశ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో కొత్త కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం చెబుతోందని, ఇది తెలంగాణకు ఇచ్చిన హామీని విస్మరించడమే అని బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని తొలుత 1980లో పీవీ హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత పంజాబ్‌కు ఆ ఫ్యాక్టరీ వెళ్లిందన్నారు. కొన్ని ఒప్పందాల ప్రకారం కపూర్తలాలో, ఆ తర్వాత రాయ్‌బరేలీలో ఏర్పాటు చేశారన్నారు. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లోనూ రైల్వే మంత్రులు ఉన్న కారణంగా వారికి ఫ్యాక్టరీలు ఇచ్చారన్నారు. దక్షిణాదిలో పెరంబదూర్‌లో ఉన్న రైల్వే ఫ్యాకర్టీ బాగా పనిచేస్తున్నదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలోని హామీ ఇచ్చారని, దానికి అనుగుణంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

