Sameera Reddy | సమీరా రెడ్డి గ్రాండ్ రీ-ఎంట్రీకి సిద్ధం… స్టార్ హీరో ప్రాజెక్ట్‌తో సెకండ్ ఇన్నింగ్స్
Sameera Reddy | ఒకప్పుడు టాలీవుడ్లో గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సమీరా రెడ్డి మళ్లీ వెండితెరపై మెరిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె రీ-ఎంట్రీపై వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Sameera Reddy | ఒకప్పుడు టాలీవుడ్లో గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సమీరా రెడ్డి మళ్లీ వెండితెరపై మెరిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె రీ-ఎంట్రీపై వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందిన సమీరా, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఓ స్టార్ హీరో సినిమాలో సమీరా రెడ్డి కీలకమైన పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.గతంలో కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా అలరించిన సమీరా, ఇప్పుడు తన వయస్సు, అనుభవానికి తగిన ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పేరు కోసం కాకుండా, కథలో బలం ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో కూడా సమీరా రెడ్డి అభిమానులతో టచ్‌లోనే ఉంది. బాడీ పాజిటివిటీ, మాతృత్వం, ఫిట్నెస్ వంటి అంశాలపై ఆమె పంచుకున్న వీడియోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి తన వ్యక్తిగత అనుభవాలను నిజాయితీగా పంచుకోవడంతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇప్పటికే పలువురు సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో, సమీరా రీ-ఎంట్రీపై కూడా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఆమె కెరీర్లో ఒక మలుపుగా నిలుస్తుందని భావిస్తున్నారు. అయితే ఆమె నటిస్తున్న ఆ స్టార్ హీరో సినిమా ఏది? అందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? వంటి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. మొత్తానికి, సమీరా రెడ్డి రాకతో టాలీవుడ్లో సీనియర్ నటీమణుల హవా మరింత పెరగనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

