ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం | బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో గురువారం శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసం సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు ఉత్సవాలను

అమరావతి : బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో గురువారం శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసం సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నది. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారిని ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అలంకరించారు. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు పూజలు నిర్వహించారు.
ఉత్సవాల చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు. దేవస్థానం ఈఓ, భ్రమరాంబ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సోమినాయుడు మొదట ప్రత్యేక పూజలు చేశారు. శాకాంబరీగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అయితే, కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో మాస్క్‌లు ధరించిన, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసిన అనంతరమే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

