కామెడీ సినిమా చేయాలనుంది

‘లవ్‌స్టోరి’ చిత్రంలో మౌనిక పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది సాయిపల్లవి. ప్రస్తుతం ఈ సినిమా తాలూకు విజయానందాన్ని ఆస్వాదిస్తున్నదామె. బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నది. సోమవారం సాయిపల్లవి ఇన్స్టాగ్రామ్ ద్వారా సరదాగా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ఎలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కామెడీ సినిమా చేయాలనుందని బదులిచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘కామెడీ సినిమా చేయాలనే కోరిక చాలా రోజులుగా ఉంది. వెండితెరపై అలాంటి పాత్రలో ప్రేక్షకులు నన్ను ఎలా స్వీకరిస్తారో చూడాలనుంది. ప్రాపర్ కామెడీ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. షూటింగ్ లేకపోతే ఇంటికే పరిమితమవుతానని, నచ్చిన భోజనాన్ని ఆరగిస్తూ హాయిగా నిద్రపోతానని తెలిపింది. విలాసాల కంటే ప్రకృతి ఒడిలో సేదతీరడమే తనకు ఇష్టమని తెలిపింది. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యతనివ్వడం ముఖ్యమని.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఒత్తిడి నుంచి దూరమవ్వడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- comedy film
- Sai Pallavi
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

