కవాడిగూడ, అక్టోబర్ 31: దీపావళి ఉత్సవాల్లో భాగంగా 6న హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబుయాదవ్ చెప్పారు. ఉత్సవాలకు హర్యానా నుంచి రూ.16 కోట్ల విలువచేసే కింగ్, సర్తాజ్ దున్నపోతులను తీసుకొచ్చినట్టు తెలిపారు.
కింగ్, సర్తాజ్ దున్నపోతుల ప్రత్యేకతలు
కింగ్ దున్నపోతు వయస్సు నాలుగున్నరేండ్లు. బరువు 1500 కిలోలు. పొడవు 15 అడుగులు, ఎత్తు 5.6 అడుగులు. ప్రతిరోజు దీని ఆహారం ఖర్చు రూ.2,500-3,000. రోజూ 10 కిలోల ఆపిల్, 8 లీటర్ల పాలు, కిలో బెల్లం, 2 కిలోల చొప్పున కందిపప్పు, శనగపప్పు తదితరాలు అందిస్తారు. నిత్యం రెండుమార్లు స్నానం చేయించి కిలోన్నర ఆవ నూనెతో మసాజ్ చేస్తారు. సర్తాజ్ వయసు ఏడేండ్లు. బరువు 1600 కిలోలు, ఎత్తు 7 అడుగులు, పొడవు 15 అడుగులు. ఈ దున్నకు కింగ్‌లాగే ఖర్చు చేస్తారు.